Header Banner

ఉపాధ్యాయ సంఘాలతో ప్రభుత్వం చర్చ! ఆ మూడు డిమాండ్లపై..

  Mon May 19, 2025 17:55        Politics

ఏపీలోని ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమానికి సిద్ధం అవుతున్న వేళ.. ప్రభుత్వం చర్చలు జరుపుతుండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. విద్యాశాఖ కమిషనర్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదికతో చర్చలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశంలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు, నూతన విద్యా విధానం, ప్రభుత్వ విధానాలపై ఉన్న అభ్యంతరాలపై సుదీర్ఘంగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. అయితే ఉపాధ్యాయ సంఘాలు ప్రతిపాదించిన పలు డిమాండ్ లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. మూడు అంశాలలో మాత్రం సస్పెన్స్ నడుస్తుందని సమాచారం.

 

15 ప్రధాన డిమాండ్లు..

ఉపాధ్యాయ సంఘాలు ఈ సమావేశంలో మొత్తం 15 డిమాండ్లను ప్రభుత్వానికి సమర్పించాయి. వాటిలో ముఖ్యంగా ఉపాధ్యాయుల బదిలీల్లో పారదర్శకత, పదోన్నతులు, పీఆర్‌సీ అమలు, స్కూల్ అసిస్టెంట్‌ పదవులకు ప్రమోషన్లు, రేషనలైజేషన్‌పై స్పష్టత సహా.. పాత పాఠశాల నిర్మాణ పద్ధతుల పునరుద్ధరణ, 9 రకాలుగా స్కూళ్ల విభజనపై పునర్విచారణ, ఇంగ్లీష్ మీడియం పై మౌలిక సదుపాయాలు కల్పించకుండానే అమలు వంటి అంశాలు ఉన్నట్టు చెబుతున్నారు.

 

 

అయితే ఉపాధ్యాయ సంఘాలు ప్రతిపాదించిన డిమాండ్లలోని కొన్ని అంశాలకు.. ప్రభుత్వం సానుకూలంగా స్పందించినప్పటికీ, మూడు ప్రధాన అంశాలపై మాత్రం చర్చలు ఇంకా సాగుతున్నాయని అంటున్నారు. ఈ మూడు డిమాండ్లే చర్చల్లో అడ్డంకిగా నిలుస్తున్నాయని భావిస్తున్నారు. వాటిలో..

 

ఇది కూడా చదవండి: శ్రీశైలం ఆలయం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్పై వేటు! ఘటన వెలుగులోకి రావడంతో..

 

ఫౌండేషన్ స్కూళ్ల రద్దు..

గ్రామీణ, చిన్న పాఠశాలలను విలీనం చేయడం వల్ల విద్యా ప్రమాణాలు తగ్గుతాయని, ఈ విధానం విద్యార్థులకు చేటు చేస్తుందని ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయం. ఫౌండేషన్ స్కూళ్లను పూర్తిగా రద్దు చేయాలని వారు కోరుతున్నారు.

 

బదిలీల మార్గదర్శకాల్లో సవరణలు..

ప్రస్తుతం అమలులో ఉన్న బదిలీల విధానాన్ని అన్యాయంగా భావిస్తూ, ఉద్యోగ భద్రతతో పాటు, కుటుంబ పరిస్థితులను కూడా పరిగణలోకి తీసుకునే విధంగా మార్పులు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

 

ఇంగ్లీష్ మీడియం అమలు..

మౌలిక సదుపాయాలు, ట్రెయిన్ అయిన టీచర్లు లేని పరిస్థితిలో ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు పెట్టడం ఉపాధ్యాయ సంఘాల అభ్యంతరం. స్థానిక భాషల్లో విద్యా హక్కు భంగం అవుతోందని అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే ఈ మూడు అంశాలపై తుది నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నందున.. ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక మంత్రి నారా లోకేష్ తో సమావేశం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతుంది. మంత్రితో భేటీ తర్వాత ఉపాధ్యాయ సంఘాలు ఏం నిర్ణయం తీసుకుంటాయో అని సస్పెన్స్ నెలకొంది.

 

ఇది కూడా చదవండి: ఏపీలో పేదలకు పండగే.. ఈ పథకం కింద ఒక్కొక్కరికి రూ.2.50లక్షలు! దరఖాస్తు చేసుకోండి! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మంత్రి, మేయర్ విజయలక్ష్మి.. సౌకర్యాలపై ఆరా!

 

ముంబైలో హై అలెర్ట్.. విమానాశ్రయం, తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపులు..

 

ఎన్నారైలకు షాక్! యూఎస్ నుంచి సొమ్ము పంపితే అదనపు భారం!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?

 

ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!

 

లోకేశ్ తాజాగా కీల‌క సూచ‌న‌లు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!

 

ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!

 

మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్‌ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!

 

22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

పండగలాంటి వార్త.. విజయవాడవిశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు విదేశీ బ్యాంక్​ రుణాలు! ఆ రూట్ లోనే ఫిక్స్..

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #TeachersUnions #GovtTalks #TeacherDemands #EducationMatters #TeachersRights #EducationReforms #SchoolTeachers